PPM: సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం గుర్ల గ్రామానికి చెందిన కుమిలి సంతోష్ మంగళవారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్సై సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.