»Brs Ministers Demand That Revanth Reddy Apologize To The Farmers
BRS Ministers: రేవంత్ సారీ చెప్పు..క్లారిటీ ఇచ్చిన రేవంత్
రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ విషయంలో మాట్లాడిని మాటలను వెనక్కి తీసుకొని రైతులకు సారీ చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కాస్తా రైతులకు అనుకూలంగా మారింది.
BRS ministers demand that Revanth Reddy apologize to the farmers
BRS Ministers: అమెరికా పర్యటనలో భాగంగా రైతులకు ఉచిత కరెంట్(Free Current) పై రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ మంత్రలు(BRS Ministers) మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తూ, రైతులకు క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. ఉచిత విద్యుత్‌పై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో చెప్పాలని మంత్రులు నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), జగదీశ్ రెడ్డి(Jagadeesh Reddy) డిమాండ్ చేశారు. ఫ్రీ కరెంట్ విషయంలో మాట్లాడి కాంగ్రెస్ బొక్కబోర్ల పడిందని, సెల్ఫ్ గోల్ చేసుకుందని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లు అక్రమంగా జరిగాయంటూ నోటికివచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రేవంత్‌కు, కాంగ్రెస్(Congress)కు విద్యుత్ షాక్ తగిలిందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందనడం అవివేకం. బీఆర్ఎస్(BRS) పార్టీని విమర్శించాలంటే విపక్షాలు వేరే రంగాలను ఎంచుకోవడం మంచిది. విద్యుత్ కొనుగోళ్లు అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయని. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, రైతులకు క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు ఇంత అండగా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. కొంతమంది సబ్స్టేషన్లకు వెళ్లి గంటో, అరగంటో కరెంట్ లేదని లెక్కలు చూపుతున్నారు. అది సాంకెేతిక సమస్యలే తప్పా ఇంకేమి లేదని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నప్పుడు రైతుకు ఎందుకు ఇవ్వకూడదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మనుసులో ఉన్నదే చెప్పారు. అసలు రైతులను వారి పరిపాలనలో పట్టించుకుంటే కదా.. 3 గంటలే చాలు అంటే రైతు రోజంతా ఆ సమయం కోసం ఎదురుచూడడా, గతంలో విద్యుత్ కోసం రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లి ఎందరో రైతులు చనిపోయారో మీకు గుర్తుకు లేదా అని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంది. KCR కరెంట్ అవినీతిని అంతం చేస్తుంది. అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లైంది.
🔥కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది… వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది.