ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్టుపై విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో జరిగిన 51వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ముందుగా లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కృనాల్ పాండ్యా.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ క్రమంలో గుజరాత్ టైటాన్స్ మొదట.. రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81), శుభ్‌మాన్ గిల్ (51 బంతుల్లో 94) ఇద్దరూ అద్భుతంగా ఆరంభించారు. దీంతో దీనితో జట్టు పవర్‌ప్లేలో 78 పరుగులు చేయడంలో సహాయపడింది. గిల్ నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కేవలం 12.1 ఓవర్లలో 142 పరుగులు చేయడం విశేషం. ఎల్ఎస్జీ బౌలింగ్ విభాగంలో మొహ్సిన్ ఖాన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
ఇక తర్వాత ఆటకు దిగిన లక్నో ఆటగాళ్లలో కైల్ మేయర్స్(48), క్వింటన్ డి కాక్(70) సహా మిగతా ఆటగాళ్లు పెద్దగా స్కోర్ చేయలేదు. దీంతో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ క్రమంలో ఇంకా 56 పరుగులు మిగిలి ఉండగానే లక్నో జట్టు ఓటమి పాలైంది.