టీడీపీ నేత చంద్రబాబు నాయడి(Chandrababu naidu)పై అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సత్తెనపల్లె సభ గురించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఈ వయసులో ముసలోడు కాకపోతే వయసు వ్యక్తి అవుతాడా అంటూ ప్రశ్నించారు. ముసలోడిని ముసలోడు అంటే అతనికి ఎందుకంత బాధ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కాదు..అసలు చంద్రబాబే ముసలి సైకో అంటూ విమర్శలు చేశారు.
అంతేకాదు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లె(sattenapalli)లో ఇటీవల నిర్వహించిన సభ ప్లాప్ అయినట్లు అంబటి స్పష్టం చేశారు. రెండు మూడు వేల మంది వస్తే 50 వేల మంది వచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు సభ సక్సెస్ అయ్యిందా లేదో అనేది ఒక్కసారి ఆలోచించాలని పేర్కొన్నారు. జనం రాక సభ వేల వేల బోయిన పరిస్థితి కనపించిందని వెల్లడించారు.
మరోవైపు ఆ సభలో చంద్రబాబు(Chandrababu)ఒక్కటైనా నిజమైనా చెబుతాడేమోనని చుశానని పేర్కొన్నారు. కానీ అన్ని అబద్దాలే చెప్పారని అంబటి అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జీవితంలో నిజం చెప్పరని ఎద్దేవా చేశారు.
ఇంకోవైపు కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. కోడెల సూసైడ్ చేసుకున్నప్పుడు చంద్రాబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాబు కంటే తాను 100 రెట్లు నీతిమంతుడినని అంబటి రాంబాబు(Ambati Rambabu)వ్యాఖ్యానించారు.