»Breaking 8 More New Medical Colleges In Telangana Orders Issued
Breaking: తెలంగాణలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు..ఉత్తర్వులు జారీ
తెలంగాణకు మరో 8 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా మొత్తంగా 10 వేలకు చేరుకోనుంది.
తెలంగాణ(Telangana)కు మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు(medical Colleges) మంజూరు అయ్యాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్(cm Kcr) సర్కార్ అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలు జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఏర్పాటు కానున్నట్లు సర్కార్ వెల్లడించింది.
మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్:
One Medical College for One district, a vision of Hon’ble CM Shri KCR garu is going to be a reality.
Here are the new 8 medical colleges approved by state government adding to the existing medical colleges.
దీంతో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ(medical College) కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశంలోనే ఈ అరుదైన రికార్డును తెలంగాణ దక్కించుకుంది. ప్రతి జిల్లాలో ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. గత 9 ఏళ్ల కాలంలో మొత్తం 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రానికి మంజూరయ్యాయి.
పెంచిన మెడికల్ కాలేజీల(medical Colleges)తో కలిపి ఎంబీబీఎస్(MBBS) సీట్ల సంఖ్య 10 వేలకు చేరువ కానుంది. రాబోవు రోజుల్లో మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి హరీశ్ రావు కొనియాడారు.