»Central Minister Kishan Reddys Key Comments On The Post Of State President
Kishan Reddy: రాష్ట్ర అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపికైన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి విధేయుడినని తెలిపారు. జులై 8న వరంగల్లో ప్రధాని మోదీ సమక్షంలో అధ్యక్ష బాధ్యతలను చేపడుతానని వెల్లడించారు.
బీజేపీ(BJP) అధిష్టానం తమ పార్టీలో కొత్త కొత్త మార్పులు చేస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను మార్చింది. తెలంగాణ(Telangana) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(Kishan Reddy) పేరును ప్రకటించింది. దీంతో అప్పటి వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్(Bandi sanjay) వర్గంవారు కోపోద్రిక్తులయ్యారు. మరోవైపు కిషన్ రెడ్డి కూడా మీడియా ముఖంగా మొహం తిప్పుకుని వెళ్లిపోయారు. దీనిపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. తాను పార్టీకి విధేయుడినని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు తాను ముందుకు సాగుతానని, జులై 8న వరంగల్లో జరిగే ప్రధాని మోదీ(PM Modi) సభలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతానని వెల్లడించారు.
ప్రధాని మోదీ(PM Modi) అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి(Kishan Reddy) దూరంగా ఉండటంతో అందరికీ అనుమానం కలుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఉంటే కేంద్ర మంత్రి బాధ్యతను నిర్వర్తించడం కాస్తా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ తరుణంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్(Bandi sanjay)ను మంత్రి వర్గంలోకి కేంద్రం తీసుకోనుందనే టాక్ వినపడుతోంది.