VSP: గాజువాక ఆటోనగర్ నుంచి తుంగ్లాం వెళ్లే దారిలో మంగళవారం సాయంత్రం ఒక లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 35 సంవత్సరాల మీరాజ్ హుస్సేన్‌గా గుర్తించారు. మీరాజ్ హుస్సేన్ వంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బలమైన వస్తువుతో తలపై గాయపర్చడం వల్లనే మరణం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.