HYD: బోయిన్పల్లిలోని ఓ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తనీష్ రెడ్డి అనే విద్యార్థి పాఠశాల భవనం 2వ ఫ్లోర్ నుంచి గురువారం కింద పడిపోయాడు. ప్రమాదం జరిగినా విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. గతంలోను ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని పడి మృతి చెందినట్లు సమాచారం.