Bala Krishna : తారకరత్న కోసం బాలయ్య షాకింగ్ డెసిషన్!
Bala Krishna : గత కొన్ని రోజులుగా నందమూరి తారకరత్న పరిస్థితి ఎలా ఉంది.. హెల్తే అప్డేట్ ఏంటని.. టెన్షన్ పడుతునే ఉన్నారు అభిమానులు. పాదయాత్రలో కుప్పకూలిపోయిన తారకరత్నకు.. ముందుగా అస్వస్థత అన్నారు.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అన్నారు.. కానీ చివరకు పరిస్థితి విషమన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఎకో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లాలని యత్నించారు. కానీ చివరకు ఫారిన్ డాక్టర్లను రప్పించి తారకరత్నకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా నందమూరి తారకరత్న పరిస్థితి ఎలా ఉంది.. హెల్తే అప్డేట్ ఏంటని.. టెన్షన్ పడుతునే ఉన్నారు అభిమానులు. పాదయాత్రలో కుప్పకూలిపోయిన తారకరత్నకు.. ముందుగా అస్వస్థత అన్నారు.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అన్నారు.. కానీ చివరకు పరిస్థితి విషమన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఎకో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లాలని యత్నించారు. కానీ చివరకు ఫారిన్ డాక్టర్లను రప్పించి తారకరత్నకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే మొదటి నుంచి తారకరత్న వెంటే ఉన్నారు బాబాయ్ బాలయ్య. దగ్గరుండి చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. తారకరత్న వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అబ్బాయ్ ఆరోగ్యం మెరుగవ్వాలంటూ అఖండ దీపానికి కూడా శ్రీకారం చుట్టారు. అసలు బాలయ్య మృత్యుంజయ మంత్రమే తారకరత్నను కాపాడిందని అంటున్నారు. ఇలా ఒక్కటని కాదు.. తారకరత్న కోలుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు బాలయ్య. అంతేకాదు.. ఇప్పుడో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒకటి అరా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. దాంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కొత్త షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పుడిప్పుడే షూటింగ్లో జాయిన్ అయ్యే సూచనలు లేవట. అంతేకాదు.. తారకరత్న కోలుకునే వరకు షూటింగ్‌కు హాజరుకాలేనని.. లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా వేయమని చిత్ర యూనిట్‌ని కోరారట. తారకరత్న పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్లో జాయిన్ అవనున్నారని అంటున్నారు. దాంతో 108 అనుకున్న సమయానికి కంటే.. కాస్త లేట్ అవనుందని అంటున్నారు. దీంతో బాలయ్యతో పాటు.. నందమూరి అభిమానులు కూడా తారకరత్న తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.