»Balayya Nbk 108 Movie Bhagavanth Kesari Title Announced
NBK108: బాలయ్య ‘భగవంత్ కేసరి’ టైటిల్ అనౌన్స్
బాలయ్య(balakrishna) కెరీర్లో 108వ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్(Bhagavanth Kesari) అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన బాలయ్య లుక్ అదిరిపోయే రేంజ్లో ఉంది.
జూన్ 10 బాలయ్య బర్త్ డే ఉండడంతో.. ఇప్పటికే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. వాళ్లకు మరింత కిక్ ఇస్తూ రెండు రోజుల ముందే.. ఎన్బీకె 108 టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా కొత్తగా ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108(NBK 108) హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘భగవంత్ కేసరి(Bhagavanth Kesari)’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘ఐ డోంట్ కేర్’… అనేది ట్యాగ్ లైన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా.. అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ.. రిలీజ్ చేసిన బాలయ్య లుక్ అదిరిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీ బ్యాక్ డ్రాప్లో పవర్ ఫుల్‌గా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు బాలయ్య(balakrishna). ఇక టైటిల్లో బాలయ్య పవర్ ఫుల్ కాప్‌గా కనిపించబోతున్నట్టు National emblemతో హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక జూన్ 10న మరో అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆ రోజు ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేయనున్నారు.
వచ్చే దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి బాలయ్య బిరుదు మారనుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘గ్లోబల్ లయన్’ బిరుదును ప్రకటించారు. ఇక షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి తెలంగాణ(telangana) స్లాంగ్‌తో బాలయ్య, అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.