గోవా బామగా, సన్నని నాజుకు నడుముతో ప్రేక్షకులను ఫిదా చేసిన అందాల బామ నటి ఇలియానా తల్లి కాబోతుంది! తనకు ప్రెగ్నెన్సీ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇలియానా పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు మొదట పోకిరీ సినిమా గుర్తుకు వస్తుంది. 2006 నుండి దాదాపు ఆరేడేళ్ల పాటు టాలీవుడ్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ కూడా నాలుగేళ్ల పాటు సినిమాలు చేసింది.
గత కొంతకాలంగా ఆమె పోర్చుగల్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కత్రినా కైఫ్ సోదరుడితోను రిలేషన్ షిప్ లో ఉందనే ప్రచారం సాగింది. ఓ వైపు డేటింగ్ వార్తలు వస్తున్నప్పటికీ.. ఎలాంటి పెళ్లి వార్త లేకుండానే ఇప్పుడు ప్రెగ్నెన్సీని ప్రకటించింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది!
కొంతకాలంగా ఇలియానా కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతుంది. ఆమె ప్రేమలో పడి విఫలమైన తర్వాత పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ తర్వాత వెయిట్ కూడా పెరిగింది. అడపాదడపా ఒకటి అర తప్ప పెద్దగా అవకాశాలు లేవు. తరచూ బీచ్లో బికినీలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో ‘మామా’ అంటూ ఉన్న చైన్ని షేర్ చేసింది. ‘అండ్ సో ది అడ్వెంచర్ బిగిన్స్’ అని రాసి ఉన్న టీషర్ట్ ని షేర్ చేసింది. కమింగ్ సూన్.. నా డార్లింగ్ ను చూడాలనే ఉత్సుకతతో ఉన్నానంటూ పోస్టులు పెట్టింది.
ఇలియానా హఠాత్తుగా ప్రెగ్నెన్సీని ప్రకటించడంపై నెట్టించ చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఆమె పెళ్లి విషయం బయటకు రాలేదు. డేటింగ్ మాత్రమే వినిపించేది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావని, చిన్నారికి తండ్రి ఎవరు అని అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా నిజమేనా.. లేక ఏదైనా ప్రమోషన్ కోసమా చూడాలి.