MNCL: బెల్లంపల్లిలోని పలు బార్ & రెస్టారెంట్లలో మున్సిపల్ కమిషనర్ రమేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అతిథి, శ్రావణ్ గ్రాండ్, రాయల్ & బార్ రెస్టారెంట్లలో కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. కల్తీ ఆహారం విక్రయించిన బార్ & హోటల్ యజమానులకు రూ.10వేల జరిమానా విధించారు. కల్తీ ఆహారం విక్రయించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు