TG: హైదరాబాద్, మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 1409 వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 5 బైకులు దగ్ధం అయ్యాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. పొగ మూలంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.