»Arunachal An Integral Part Of India Says Us Condemns Chinas Military Aggression
McMahon Line: అరుణాచల్ భారత్లో భాగం, చైనాపై అమెరికా ఆగ్రహం
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న మెక్ మహోన్ లైన్ ను (McMahon Line as international boundary) అమెరికా ఇటీవలే గుర్తిస్తూ బై-పార్టిషన్ రిజొల్యూషన్ ను పాస్ చేసింది. తద్వారా అరుణాచల్… భారత్ లో భాగమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సెనేట్ లో ప్రవేశ పెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా బెదిరింపులు కొనసాగుతున్న సమయంలో తమ వ్యూహాత్మక భాగస్వాములకు అండగా నిలబడటం ఎంతో కీలకమని, సెనేట్ లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని, వీటిని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని నిస్సందేహంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇండో – పసిపిక్ ప్రాంతంలో సుస్థిరత కోసం అమెరికా – భారత్ భాగస్వామ్యాన్ని, క్వాడ్ ను మెరుగుపరుచుతామని ఈ తీర్మానం పేర్కొంది.
గత కొద్ది సంవత్సరాలుగా చైనా – భారత్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా నుండి సానుకూల స్పందన రావడం గమనార్హం. చైనా, అరుణాచల్ మధ్య మెక్ మహోన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. సరిహద్దు వెంబడి వివిధ ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ లోని ప్రాంతాలకు మాండరీన్ భాష పేర్లతో మ్యాపుల ప్రచురణ వంటి చైనా చర్యలను తప్పుబట్టింది.