»Ananthapuram District Tadipatri Ci Ananda Rao Commits Suicide By Procession To The Fan
CI ananda rao: ఫ్యాన్ కు ఊరేసుకుని సీఐ ఆత్మహత్య
ఏపీలోని తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (Tadipatri CI) ఆనందరావు(ananda rao) తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ(Tadipatri CI)గా పనిచేస్తున్న ఆనందరావు(ananda rao) సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో రెండు గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు, పని ఒత్తిడి ఇందుకు కారణమని తెలుస్తోంది. హాలులో భార్య, పిల్లలు ఆరుబయట నిద్రిస్తున్నారు. అయితే ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఆనందరావు గతంలో కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి గత తొమ్మిది నెలల క్రితం బదిలీలో భాగంగా తాడిపత్రి పట్టణానికి వచ్చారు. మరోవైపు ఆనంద్ రావు కుమార్తె భవ్య, తన తండ్రి విషాద నిర్ణయం వెనుక పని సంబంధిత ఒత్తిడిని(work pressure) ప్రధాన కారణంగా పేర్కొన్నారు. తాడిపత్రిలో అధిక పనిభారం, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా అతను తరచూ బాధలను వెల్లడించాడేవారని చెబుతున్నారు.