»Alert For Many Districts Of Telangana Heavy Rains
Rain Alert: తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్..భారీ వర్షాలు
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతు పవనాలు రాష్ట్రం అంతటా వ్యాపించడం వల్ల పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణ(Telangana)లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 24 గంటల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరించింది.
హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, 10 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నగరంలోని బాలానగర్, చింతల్, కూకట్పల్లి, మాదాపూర్, బేగంపేట, ఎల్బీనగర్, ఘట్కేసర్, కీసర, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల కార్లు సైతం నీట మునిగాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైందని, 12 రోజులు ఆలస్యం రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, జూన్ 25, 26వ తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ(Weather Department) ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది.