కరుణానిధి తనయుడు, కేంద్ర మాజీమంత్రి అళగిరి తన సోదరుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ను నాయకుడిగా అంగీకరించనున్నారు. త్వరలో డీఎంకేలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే డీఎంకే అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, క్రీడాశాఖా మంత్రి ఉదయనిధి మదురై వెళ్లి తన పెదనాన్న అళగిరిని కలిశారు. ఉదయనిధికి అళగిరి కుటుంబం సాదర స్వాగతం పలికింది. అనంతరం ఉదయనిధి-అళగిరి ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. తాజాగా అళగిరి ట్వీట్ కూడా చేశారు. వారి భేటీ అనంతరం… మళ్లీ పార్టీలో చేరే అవకాశముందా అని విలేఖరులు అడగగా… ఆ విషయం పార్టీ పెద్దలను అడగాలని చెప్పారు. తాజాగా డీఎంకేపై విశ్వాసం శాశ్వతం అని ట్వీట్ చేశారు. అళగిరి అంశం పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తిరిగి డీఎంకే లో చేరవచ్చున్నని అంటున్నారు.
పార్టీ వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్నారని కరుణానిధి ఉన్నపుడే తనయుడిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు తిరిగి పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాలిన్ ను అంగీకరిస్తారా అంటే.. నేను పార్టీలో ఉంటే అంగీకరిస్తాను అన్నారు. అయితే ఆయనను చేర్చుకోవడానికి స్టాలిన్ కు ఆసక్తి లేదని తెలుస్తోంది.