Akula Srivani: ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న పార్టీ BJP..అభ్యర్థులు లేరని BRS గారడి మాటలు
సరూర్ నగర్ బీజేపీ నేత, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(Akula Srivani)తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలను పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
కర్ణాటక ఎన్నికల ఫలితాల వల్ల బీజేపీకి వచ్చిన నష్టం ఏమి లేదని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(Akula Srivani) హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీకి గతంలో వచ్చిన ఓట్లే ఇప్పుడు కూడా వచ్చాయని స్పష్టం చేశారు. జేడీఎస్ పార్టీకి గతంలోకంటే తక్కువగా వచ్చాయని, కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కచోట గెలవగానే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మేమే జెండా ఎగురేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోడీ ఒక పర్వతం లాంటి వ్యక్తి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ మతతత్వ పార్టీ కాదని ఆకుల శ్రీవాణి అన్నారు. దేశంలో బీజేపీ రాకముందు ఎవరు మతకల్లోల పేరుతో అలర్లు సృష్టించారో చెప్పాలని నిలదీశారు. జై శ్రీరామ్ అంటే తప్పేముందని తెలిపారు. గతంలో టీడీపీ ఐడియాలజీ తెలుగు భాష ఉండేది. ప్రస్తుతం బీజేపీ దేశం, ధర్మం కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు.
తెలంగాణలో BRS పార్టీ కేసీఆర్ ఫ్యామిలీకి వచ్చిన మాటల గారిడి వేరే వారికి రాదని అన్నారు. ఆ నేతలు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆనేక అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపించారు. మరోవైపు బీజేపీకి తెలంగాణలో టిక్కెట్లు కోసం అనేక మంది వేచిచూస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతోపాటు తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే.