VZM: సీతానగరం మండలం బూర్జలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఈనెల 10వ తేదీన వంట కలపతో నీరు కాయడానికి మంట పెట్టింది. ఆ సమయంలో మరో పని చేస్తుండగా ఆమె చీరకు మంట తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విజయలక్ష్మిని పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.