NZB: నవీపెట్ మండలం లింగపూర్ శివారులో బుధవారం రెంజర్ల పోశెట్టి విద్యుత్తు షాక్ తగిలి మరణించాడు. విద్యుత్తు సరఫరా నిలిపివేయకుండా స్తంభం ఎక్కడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.