బ్రెజిల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. రాజధాని బ్రసీలియాలో రెండుసార్లు పేలుళ్లు సంభవించడంతో ఒకరు మృతిచెందారు. వెంటనే అప్రమత్తమై లోపలున్న జడ్జిలు, ఇతర సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.