CTR: పుత్తూరు బైపాస్ రోడ్డుపై బుదవారం లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం..తమిళనాడుకు చెందిన మూర్తి గురునాథ్ (60), సుబ్రహ్మణ్యం (53) ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.