»A Two Year Old Boy Who Got A Place In The World Book Of Records 195 Countries Flags Identified
World Book of Records:లో చోటు దక్కించుకున్న రెండేళ్ల బుడ్డోడు తన్మయ్
అమృత్‌సర్‌కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బాబు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు భగవద్గీతను ఎక్కువగా విన్నానని వెల్లడించింది.
మీరెప్పుడైనా 100 దేశాల జెండాలను(195 countries) గుర్తుపెట్టుకున్నారా. లేదు చాలా కష్టం. మా దేశం జెండా సహా రెండు మూడు దేశాల జెండాలు మాత్రమే గుర్తించగలం. కానీ పంజాబ్ అమృత్ సర్ లోని రంజిత్ అవెన్యూకు చెందిన రెండేళ్ల తన్మయ్ నారంగ్(Tanmay Narang)ఏకంగా 195 దేశాల జెండాలను గుర్తుపడుతున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(World Book of Records)లోకి ప్రవేశించినట్లు అతని తల్లి హీనా నారంగ్(heena Narang) తెలిపారు. ఇంత చిన్న వయసులోనే అరుదైన ఘనతను సాధించి ఔరా అనిపిస్తున్నాడు.
ఈ నేఫథ్యంలో తన్మయ్ కొద్ది రోజుల క్రితమే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్, మెడల్, కేటలాగ్‌ను అందుకున్నారు. తన్మయ్ అరుదైన ఫీట్‌తో ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేశారని అతని తల్లి హీనా(heena)అన్నారు. దీంతోపాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా తన పేరు నమోదు చేసుకోబోతున్నట్లు ఆమె తెలిపారు. తన్మయ్ 1 సంవత్సరం 4 నెలల వయస్సులో ఉన్నప్పుడు, అతను మైండ్ డెవలప్మెంట్ గేమ్‌లను అలవాటు చేసినట్లు ఆమె వెల్లడించింది.
చదవండి: MIM : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు..
అంతేకాదు తన్మయ్ పెద్ద సంఖ్యలో పండ్లు, కూరగాయలు, మొక్కలు మొదలైన వాటి పేర్లను గుర్తుంచుకోగలడని ఆమె చెబుతోంది. ప్రపంచ దేశాల కరెన్సీలు, ఉపఖండాల పేర్లను కూడా అతను గుర్తుంచుకుంటాడని గర్వంగా చెప్పింది. తన్మయ్ సాధించిన విజయంపై అతిగా నమ్మకంగా ఉండకూడదని, మరిన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండాలని కోరుకుంటున్నామని తన్మయ్ తల్లిదండ్రులు(parents) సూచిస్తున్నారు.
అయితే తాను గర్భవతిగా ఉన్నప్పుడు భగవద్గీత(Bhagavad Gita)ను విన్నానని, అది బిడ్డపై ప్రభావం చూపుతుందని హీనా చెప్పింది. అంతేకాకుండా, తన్మయ్ జ్ఞాపకశక్తి నైపుణ్యాల కోసం ఆమె ఇంట్లో నేర్చుకునే వాతావరణాన్ని క్రీయేట్ చేసినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు తన్మయ్‌కు చాక్లెట్లు అందించడం కంటే మైండ్ డెవలప్మెంట్ గేమ్‌లను బహుమతిగా ఇచ్చారని ఆమె వెల్లడించింది. తన్మయ్ తండ్రి నిశాంత్ మాట్లాడుతూ.. తమ బిడ్డ సరైన చదువులు చదివి సంతోషంగా జీవితాన్ని గడపాలన్నదే తమ కల అని అన్నారు. ఇంత లేత వయసులో తన్మయ్ చాలా నేర్చుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వెల్లడించారు.