»Kejriwal Proposes To Read Three Books Namely Bhagavad Gita Ramayanam And How Prime Ministers Decide
Kejriwal: మూడు పుస్తకాలు చదువుకునేందుకు కేజ్రీవాల్ దరఖాస్తు.. అవేంటంటే?
ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ మరో 15 రోజుల పాటు జైలులోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మూడు పుస్తకాలను చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాడు. అయితే ఆ బుక్స్ ఏంటన్నది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Kejriwal: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో చిక్కు ఎదురైంది. ఈరోజు ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను జుడిషియల్ కస్టడీకి పంపింది. ఏప్రిల్ 15 వరకు అక్కడే ఉండనున్నారు. స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. రౌజ్ అవెన్యూ కోర్టులో తాజా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టులో ఓ అప్లికేషన్ దాఖలు చేశారు. మూడు పుస్తకాలను చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టును కోరారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలు చదువునే అనుమతి ఇవ్వాలని ఆ అప్లికేషన్లో తెలిపారు.
ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్‌కు వెళ్లిన కేజ్రీవాల్ మరో 15 రోజుల పాటు జైల్లోనే గడపనున్నారు. బహుశా ఈ సమయంలో ఆయన ఈ పుస్తకాలు చదువుతారని అందరూ భావిస్తున్నారు. మద్యం పాలసీ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన నిందితుడు అని ఈడీ ఆరోపించింది. ఇది వరకే చాలా సార్లు ఆయనకు ఈడీ సమన్లు పంపింది. ఈ మేరకు మార్చి 21 న అరెస్టు చేశారు. హౌ ప్రైమ్‌మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాన్ని జర్నలిస్టు నీరజ్ చౌదరీ రాశారు. ప్రధానులు ఎలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారో ఆ పుస్తకంలో ఆయన తెలిపారు. ఈ పుస్తకాన్ని చదవడానికి అనుమతి కోరడంపై రాజకీయంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆలోచన తీరును ఆయన క్వశ్చన్ చేసినట్లుగా, అందుకే ఈ పుస్తకం పేరును ఉటంకించారని ప్రధాన కామెంట్లు వినిపిస్తున్నాయి.