Guwahati Airport Ceiling Collapses : అస్సాంలో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర రాజధాని గువాహటిలో ఉన్న విమానాశ్రయం(Guwahati Airport) పై కప్పులో కొంత భాగం ఉన్నట్లుండి కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కాకపోతే పై కప్పు కూలిన వేళ అక్కడ ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి అంతా పరుగులు పెట్టారు.
ప్రస్తుతం అస్సాంని ఓ బలమైన తుపాను అతలాకుతలం చేసింది. దీంతో అక్కడ భారీగా వర్షాలు(Heavy Rain) కురిశాయి. ఫలితంగా ఎయిర్పోర్టు టెర్మినల్ వెలుపల కొంత పైకప్పు భాగం ఎగిరిపోయింది. తర్వాత దానికున్న సీలింగ్ కిందికి కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్లించినట్లు వెల్లడించారు.
ఈ విమానాశ్రయం గౌతమ్ అదానికి చెందిని కంపెనీ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్లో వైరల్గా మారాయి. ఆ వీడియో ఇక్కడుంది. మీరూ చూసేయొచ్చు.
Have a dekho of the condition of Lokpriya Gopinath Bordoloi International Airport in #Guwahati owned and operated by Modi’s numero uno, Gautam Adani’s company @AdaniOnline