హిందువుల పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతపై స్లోవేనియన్ తత్వవేత్త స్లావోజ్ బిజెక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ గ్రంథం అశ్లీలమైందని, అసహ్యమైందని, ఆ పవిత్ర గ్రంథాన్ని తాను ద్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతీయులు పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీత (Bhagavad Gita)పై స్లోవేనియన్ తత్వవేత్త స్లావోజ్ బిజెక్ (Slavoj Zizek) షాకింగ్ కామెంట్స్ (Shocking Comments) చేశారు. భగవద్గీత చాలా అశ్లీలమైనదని, అసహ్యమైందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్మనీకి చెందిన నాజీ రాజకీయ నాయకుడు హెన్రిచ్ హిమ్లెర్ యూదులపై జరిగిన మారణ హోమాన్ని సమర్ధించుకునేందుకు భగవద్గీతను ఉపయోగించినట్లు స్లావోజ్ బిజెన్ గుర్తు చేశాడు.
Slavoj Žižek, the most prominent communist philosopher in the world currently, calls Bhagavad Gita "one of the most obscene disgusting sacred books" and blames Bhagavad Gita for Nazi Heinrich Himmler allegedly using it to justify genocide of Jews pic.twitter.com/9lrIzJXetZ
భగవద్గీత (Bhagavad Gita) అనేది 700 శ్లోకాలతో కూడిన హిందూ పవిత్ర గ్రంథంగా ఉంది. గతంలో ఈ గ్రంథంపై మరికొందరు విమర్శలు గుప్పించారు. తాజాగా ఇప్పుడు స్లావోజ్ బిజెక్ (Slavoj Zizek) ఈ కీలక వ్యాఖ్యలు (Shocking Comments) చేయడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యనే హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్హైమర్’ విడుదలైంది. ఈ మూవీలోని ఓ సీన్లో పాత్రలు భగవద్గీత చదువుంటే లైంగిక చర్యలో పాల్గొంటాయి. ఆ సన్నివేశాన్ని జిజెక్ గుర్తు చేస్తూ భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అశ్లీలమైన, అసహ్యకరమైన వచన సారాంశాలతో అందమైన లైంగిక చర్యను చిత్రీకరించడం అద్భుతమని ఆయన అన్నారు. భగవద్గీతలోని ఆధ్యాత్మిక భాగాన్ని తాను ద్వేషిస్తున్నానని బిజెక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.