»A Big Shock For Roja Who Went To Tamilnadu Temple Media Asking Rajinikanth Questions Roja With Expression
Minister Roja:కు గట్టి షాక్..తమిళనాడులో వింత ఎక్స్ ప్రేషన్ తో
తమిళనాడు తిరుచెందూర్ లోని మురుగన్ ఆలయాన్ని మంత్రి రోజా(Minister Roja) ఫ్యామిలీతో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన క్రమంలో రజినీపై విమర్శల గురించి మీడియా ప్రశ్నించగా ఆమె వింతగా ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. అది చూసిన రజినీ ఫ్యాన్స్ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులోని ప్రముఖ తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయానికి ప్రతిరోజూ అనేక మంది భక్తులు వస్తుంటారు. ఆ క్రమంలోనే సినీ నటి, ఏపీ టూరిజం యువజన, అభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా(Minister Roja) కూడా కుటుంబ సమేతంగా నిన్న తిరుచెందూర్ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం లోపలి ప్రాకారంలోని షణ్ముఖర్, పెరుమాళ్ దత్తాశనమూర్తి తదితర క్షేత్రాలను ఆమె సందర్శించారు.
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉందని, చాలా ఏళ్ల తర్వాత కుటుంబ సమేతంగా వచ్చామని పేర్కొన్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎం అని కొనియాడారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై రోజా విమర్శలు గుప్పించడంపై ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు చివరి వరకు ఆమె సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అయితే ఆంధ్రాలో రజనీపై హాట్ హాట్ గా మాట్లాడిన రోజా నిన్న తమిళనాడులో రజనీకాంత్ గురించి మాత్రం నోరు విప్పేందుకు తడబడ్డారు.
అంతేకాదు సమాధానం చెప్పకుండా బదులుగా నవ్వుతూ వెళ్లిపోయారు. మరోవైపు చివరిగా మంత్రి రోజా లులలులాలులా అంటూ వెక్కిరిస్తూ ప్రెస్ మీట్ ముగించుకుని హడావుడిగా తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ నుంచి వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన రజినీ ఫ్యాన్స్ ఇదేక్కడి ఎక్స్ ప్రేషన్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.