ఈమధ్యకాలంలో గుండెపోటు(Heart Attack) మరణాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకూ గుండెపోటు బాధితులు ఉన్నారు. హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతిచెందింది.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక నిహారిక(Niharika)కు శనివారం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆ పాపను హుటాహుటీన మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి(Hospital)కి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్య చికిత్స కోసం భద్రాచలంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలిక ప్రాణాలు విడిచింది.
వైద్యులు పరీక్షించగా అప్పటికే నిహారిక(Niharika) గుండెపోటు(Heart Attack)తో మరణించినట్లు నిర్ధారించారు. భద్రాచలంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు(Doctors) కూడా పరిశీలించి గుండెపోటులో మరణించినట్లు తెలిపారు. చిన్నవయసులోనే గుండెపోటుతో బాలిక మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.