కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరిలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలోపడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కుమ్మరి శంకరయ్య (65) కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి రహదారులు వెంట తిరుగుతూ ఉండేవారని అన్నారు. రహదారి వెంట నడుచుకుంటూ వెళ్లిన ఆయన చిప్పగిరి గ్రామ సచివాలయం వెనక ఉన్న బావిలో పడి మృతి చెందాడని తెలిపారు.