TPT: వరదయ్య పాలెం (M) చిన్నపాండు పంచాయతీ అపోలో పరిశ్రమ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అపోలో టైర్స్ పరిశ్రమ నుంచి వెళ్తున్న బస్సు నాగనందాపురం నుంచి ఓ పరిశ్రమకు మహిళలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న మహిళలకు గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.