Mallesham director: తెరకెక్కించిన మరొ చిత్రం “8AM METRO”
హిందీ చిత్రం '8 A.M నుంచి అధికారిక ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి మన తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ నటించిన మెట్రో' '8 A.M చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. మే 19న రిలీజ్ కానున్న ఈ చిత్రం విశేషాలు ఇప్పుడు చుద్దాం.
జీవితం అనే ఒక గమ్యం ఎరుగని ప్రయాణంలో కలిసే వ్యక్తులు సముద్రంలో పరస్పరం ఎదురుపడే ఓడల లాంటి వాళ్ళు ఏమో.? వారికి మాత్రమే దారిచూపే తెరచాపను ఆధారంగా చేసుకుని అలా సాగిపోతూనే ఉన్నా.. ప్రశాంతమైన నడి సముద్రంలో కొన్ని క్షణాలపాటు దగ్గరగా అనిపిస్తున్నట్లుగా కనిపించే వారి సమక్షంలో కొన్ని జ్ఞాపకాలను పోగుచేసుకుని వాటితో మిగిలిన యాత్రను కొనసాగితూ ఉంటారు.
అలాంటి ఒక రెండు పాత్రల జీవితాలను ఇతి వృత్తాలుగా చేసుకుని ఒక అద్భుతమైన భావోద్వేగభరితమైన జర్నీ లాంటి సినిమాను మన అందిస్తున్నారు మల్లేశం డైరెక్టర్ రాజ్ .ఆర్. ఆయన స్వీయ దర్శకతంలో కిషోర్ గంజితో కలిసి నిర్మిస్తున్న చిత్రం 8AM Metro. మెట్రో ట్రైన్ ప్రయాణంలో కలిసిన ఇద్దరు మనుషుల మధ్య మొదలయిన పరిచయం గాఢమైన స్నేహంగా మారిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎదురయిన సంఘటనలు వాళ్ళను ఎటు నడిపించాయి.? అనే కథతో ఈ మూవీ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించడంలో సగటు మనుషుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల పాత్ర ఎంతవరకు ఉంటుదనేది ఈ సినిమాలో మనం ఆశించవచ్చు.
నటీనటుల విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, హీరోయిన్ సయామీ ఖేర్ వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. వాళ్ళ లుక్స్ చాలా సహజంగా ఉన్నాయి. ట్రైలర్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే మరొక అంశం మార్క్ కె రాబిన్ అందించిన నేపథ్య సంగీతం.
సగటు మనిషిగా మొదలైన ఒక మనిషి జీవన గమనంలో విజేతగా మారిన కథను మల్లేశం సినిమా ద్వారా మనకు చెప్పిన దర్శకుడు రాజ్.ఆర్ ఈ సినిమాను కూడా ఎంతో సహజంగా తీర్చి దిద్దినట్టుగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమా మే19 న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.