KMM: సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఆటోను అడవి దున్నలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలైయ్యాయి. చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన ఐదుగురు కూలీలు సత్తుపల్లిలో పని నిమిత్తం ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ, కూలి ఓదేలకు గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు.