MLG: తాడ్వాయి మండలం వెంగళపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన ట్రాక్టర్లో వ్యవసాయ కూలీలను తీసుకెళ్తూ రోడ్డు పక్కన ఆగింది. ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ ట్రాక్టర్ను వెనక నుండి ఢీ కొట్టాడు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.