SKLM: పాతపట్నంలో ఆల్ ఆంధ్ర రోడ్డు ప్రక్కనగల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి దొంగలు చొరబడి ఆలయ హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారని ఆలయ పురోహితులు, కమిటీ సభ్యులు తెలిపారు. పాతపట్నం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశామన్నారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు.