KMR: పిట్లం మండలం ధర్మారంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు ప్రకాష్ తండ్రి అంత్యక్రియల కోసం బుధవారం గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతుండగా ప్రకాష్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయికనిపించాడు. ప్రకాష్ మరణంపై అనుమానం ఉందని, మృతుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.