TG: పలు కేసుల్లో నిందితురాలిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ధూల్‌పేట్ గంజాయి డాన్ అంగూర్ బాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ధూల్‌పేట్ కింద కార్వాన్లో ఎక్సైజ్ పోలీసు బృందం ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు. అంగూర్ బాయిపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మంగళ్‌హాట్‌లో 4 కేసులు, అసిఫ్‌నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయి.