AP: నగ్నవీడియోలతో బెదిరించి రెండేళ్లుగా అత్యారం చేస్తూ, హింసలకు గురి చేస్తున్నాడంటూ ఓ వివాహిత నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరు నల్లపాడు రోడ్డులో తినుబండారాల వ్యాపారం చేస్తున్న మహిళ ఫోన్ నెంబర్ తీసుకున్న వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు పరిచయం పెంచుకున్నాడు. తరువాత తనపై అత్యాచారం చేసి చిత్రీకరించాడు. వాటిని అడ్డుపెట్టుకొని తరచూ అత్యాచారం చేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.