AP: అనంతపురం జిల్లాలో ఓ తండ్రి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు కుమార్తెలను LLC కాలువలోకి తోసి చంపాడు. భార్యపై అనుమానంతో తండ్రి కల్లప్ప కుమార్తెలను చంపేశాడు. గుడికి వెళ్దామని చెప్పి కుమార్తెలను తీసుకెళ్లి కాలువలోకి తోశాడు. ఈ క్రమంలో ఒక చిన్నారి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.