BDK: అన్నపురెడ్డిపల్లి మండలం కంపగూడెం గ్రామం వద్ద ఓ బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో వెంకటేశ్వర్లు(60) మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.