TPT: చంద్రగిరి (M) మామండూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షంలో రోడ్డు దాటుతున్న రుద్ర ప్రసాద్ (31) అనే ఒడిశాకు చెందిన వ్యక్తిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.