ELR: కామవరపుకోట మండలం అంకాలంపాడుకు చెందిన టీడీపీ నాయకుడు బొప్పన మురళి శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మురళి మృతి పార్టీకి తీరని లోటని కూటమి నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.