చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని హైవేపై వెళ్తున్న 49 వాహనాలు 10 నిమిషాల వ్యవధిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు. గాయాలపాలైనవారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.