NRML: భైంసాలో బీజేపీ నేతలతో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండే, పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. సర్వే ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలపై దృష్టి సారించాలని చెప్పారు.