NTR: విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం యూనివర్సిటీ సమీపంలో మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 50 నుంచి 55 మధ్య ఉంటుందని మాచవరం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన యెడల మాచవరం పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.