TG: ఇంటి ఆవరణలోని ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా సత్యపేటలో జరిగింది. సోయం శివ-సంధ్యారాణి దంపతుల పాప మోక్ష దుర్గ(1) నడుచుకుంటూ వెళ్లి ఇంకుడుగుంతలో పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో కాసేపటికే చిన్నారి మృతిచెందింది. మోక్ష దుర్గ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.