కోనసీమ: మండపేట మండలం కేశవరం రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని 80 ఏళ్ల వృద్ధ యాచకుడు సోమవారం మృతి చెందాడు. గ్రామంలో యాచకం చేస్తూ జీవనం సాగిస్తున్నాడనీ గ్రామస్తులు చెబుతున్నారు. ఎరుపు తెలుపు గీతల చొక్కా, పట్టు పంచె, పసుపురంగు టవల్ ధరించి ఉన్నాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.