Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
టమాటాల రేట్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. కేజీ టమాటా ఏకంగా రూ.250కి చేరింది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ ప్రాతంలో ప్రస్తుతం కిలో టమాటా రూ. 250 పలుకుతోంది. మరోవైపు ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 నుంచి 200 వరకు ఉన్నట్లుగా అక్కడి వినియోగదారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా ప్రియమైందని కూరగాయల విక్రయదారులు అంటున్నారు.
ఈ క్రమంలో ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వాటిని కొనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు అంటున్నారు. గంగోత్రి, యమునోత్రిలో టమాటా కిలో రూ.200 నుంచి రూ.250 పలుకుతోందని కూరగాయల విక్రయదారులు వెల్లడించారు.