HYD: చౌదర్ గూడ మండలం గుర్రంపల్లి వాగులో విషాదం చోటు చేసుకుంది. వాగు దాటుతుండగా సత్తయ్య(50) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం ఈ ప్రమాదానికి కారణమైంది. సమాచారం అందుకున్న అధికారులు, స్థానికుల సహాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.