E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకి చెందిన బెందాడి శాంతిప్రియ(21) అదృశంపై ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ధవలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న శాంతిప్రియ ఈనెల 9న కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం తండ్రి నూకరాజు ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.