NRML: పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కడెం మండల కేంద్రంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రజిత ఇంటి సమీపంలో పాముకాటుకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రజిత మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.